జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది గుర్తుంచికొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వము బీసీలకు మాట తపిందిఅని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు పర్చలని చూచించారు. ఇది వరకే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ లకు మోసం జరిగింది. కాబట్టి ఇప్పుడు త్వరలో జరుగబోయే స్థానిక ఎలక్షన్లులో అమలు పర్చలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు కొండాపురం నర్సింలు. బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్. పెద్దగొల్ల .నారాయణ, కార్యదర్శి శంకర్ సాగర్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్, నాయకులు మోహన్, గోపాల్, నాయకుని శ్రీకాంత్ బాలకృష్ణ, శివ మాదినం తదితరులు పాల్గొన్నారు.


