Listen to this article

జనం న్యూస్ 22ఫిబ్రవరి పెగడపల్లి పేదల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ధ్యేయం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్లమరియు నందగిరి గ్రామాలలో నూతన గృహప్రవేశాలను స్థానిక సర్పంచ్లు కుంటాల వనజ శ్రీనివాస్మరియు దన్యాల రజిత సురేష్
నూతన ఇందిరమైండ్ల గృహప్రవేశాల ప్రారంభం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో మంజూరైన మండలంలోని దాదాపు సగం వరకు ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని రోజురోజుకు గృహప్రవేశాలు చేసుకుంటూ ఇందిరమ్మండ్ల లబ్ధిదారులు సంబరాలు జరుపుకుంటున్నారని ఇది పేద ప్రజల సంక్షేమ కోసం పని చేస్తూ అర్హులైన మిగతా వారందరికీ కూడా రాబోవుకాలంలో ఇల్లు మంజూరు చేయడానికి సిద్ధంగా రాష్ట్ర గవర్నమెంటు ఉందని ఇది నిజమైన ప్రజా పాలన ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్లు ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి తౌటుశేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెట్ల కిషన్ కడారి తిరుపతి పంచాయతీ కార్యదర్శులు నవీన్ కుమార్ మధుకర్ వార్డు సభ్యులు మేక మాధవి రాయమల్లు అత్యం గంగాధర్ సుంకే రాధ కుంటాల జమున లక్ష్మీకాంతం తడగొండ శ్రీలత సురేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.