
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు మాత్రమే కాకుండా, పాఠశాల, కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్నీ తమ విద్యార్థులకు కూడా వీక్షించేలా చేయాలని, ప్రధానమంత్రి సందేశానంతరం వారి చేసిన సందేశాలను ప్రశ్నలలుగా రూపొందించి ఒక ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు సేకరించి వారి నైపుణ్యాన్ని బట్టి బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేయడంతో, పాఠశాల మరియు కళాశాల హెడ్మాస్టర్లు,ప్రిన్సిపాల్ మరియు వారి సిబ్బంది సానుకూలంగా స్పందించడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన ముమ్మిడివరం బిజెపి టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి రుద్రరాజు నరేంద్ర వర్మ మరియు ముమ్మిడివరం టౌన్ బిజెపి సీనియర్ నాయకులు.


