Listen to this article

జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత కంపల్సరిగా ఉందని ఇన్నాళ్లుగా ఎదురు చూసామని డిపిఆర్ ఆధారంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని మోసపోయాం దారి మళ్లించి ప్రమాదాలకు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించేటువంటి ఇప్పుడు ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జి మాకు వద్దని ఆర్ అండ్ బి రోడ్డుపైనే అండర్ బిట్స్ చేసినట్లయితే మండల అభివృద్ధికి సహాయపడుతుందని అదే మాదిరిగా గట్టు మండలం అభివృద్ధిలో కొనసాగాలంటే భారత్ మాలకు కరెక్టువిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోయలగూడెం స్వామి గట్టు మాజీ సింగల్ విండో చైర్మన్ గౌళ్ళ రాముడు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రజలు ప్రజలు మల్లాపురం తాండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.