

జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ బస్ స్టాండ్ లో బంగారం చోరీకి గురైంది. టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల శకుంతల అనే మహిళ కాగజ్ నగర్ లోని తన చెల్లెలు ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం ఈనెల 7న వచ్చింది. సోమవారం రోజు తిరుగు ప్రయాణంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో దాహం వేయడం తో తన బ్యాగులో నుండి నీళ్ళ బాటిల్ తీసి త్రాగిన మళ్ళి బాటిల్ ను హ్యాండ్ బ్యాగులో పెట్టింది… కాని బ్యాగ్ జిప్ పెట్టడం మరిచిపోయింది. కొంత సేపటికి బస్సు రావడంతో బస్సులోకి ఎక్కి కూర్చున్నాక హ్యాండ్ బ్యాగును చూడగా ఆ బ్యాగు జిప్ తీసి ఉండటాన్ని గమనించి అనుమానం వచ్చి బ్యాగులో చూడగా.. అందులో చిన్న పర్సు ఒకటి కనిపించకుండా పోయింది. ఆ పర్సులో మూడు తులాల గొలుసు (చంద్రహారం) ఉందని, బస్సు ఎక్కుతున్న క్రమంలో దొంగలు అపహరించి ఉంటారని బాధిత మహిళ అనుమానించి వెంటనే బస్సులో, బస్ స్టాండ్ లో వెతికినా పర్సు దొరకక పొయేసరికి స్తానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.