జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 తర్లుపాడు
మండలంలోని నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి భీమనబోయిన మల్లికార్జున రావు గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఏరియాలో తన మేనమామ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి తన స్వగ్రామం తర్లుపాడుకి తిరుగు ప్రయాణ సమయంలో అకస్మాత్తుగాకుప్పకూలిపోయాడు. దీంతో మల్లికార్జున ను అక్కడే ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా అంత్యక్రియలు నిమిత్తం తర్లుపాడు లోని తన స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న తర్లుపాడు తహసిల్దార్ కేకే కిషోర్ కుమార్, పలువురు విఆర్వోలు, కార్యాలయ సిబ్బంది వీఆర్వో మల్లికార్జున మృతదేహానికినివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుడు మల్లికార్జున కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న వయసులో మృతి చెందిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోవడంతో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


