Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 23 0. 02. 2026

మొగుడంపల్లి, ఫిబ్రవరి 22: రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చిరాగ్‌పల్లి పోలీసులు సూచించారు. ఆదివారం మొగుడంపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మితిమీరిన వేగం నివారణ వంటి అంశాలపై వివరించారు. అలాగే ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.