

జనం న్యూస్ ఫిబ్రవరి 10 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో సుమారు వెయ్యిమందితో నిర్వహించే లలితా సామూహిక సహస్రనామ పారా యణ కార్యక్రమానికి అమలాపురం నుంచి పలువురు బయలు దేరి వెళ్లారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్ర హ్మణ్యం ఆధ్వర్యంలో గాంధీనగర్, విత్తనాలవారి కాలువగట్టు, పేరూరు, ఎర్రవంతెన, గడియారస్తంభం కూడలి నుంచి అయిదు బస్సుల్లో వెళ్లారు. బజరంగ్ళ్ నాయకుడు సిరంగు నాయుడు, ఉటూకూరి సాంబయ్య, దూలం బుజ్జి, కురసాల వీరబాబు, ముళీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.