Listen to this article


వెంకట్ సాలేటి వికారాబాద్ జిల్లా అంబేద్కర్ సంఘాల ప్రచార కమిటీ అధ్యక్షులు

జనం న్యూస్ 23 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పసికందు ప్రాణం తీసిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వికారాబాద్ జిల్లా అంబేద్కర్ సంఘాల ప్రచార కమిటీ అధ్యక్షులు వెంకట్ సాలేటి డిమాండ్ చేశారు. నేటికీ కులం పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటని, బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు