Listen to this article

జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సెంటర్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (CTE) ఆధ్వర్యంలో “సాఫ్ట్‌వేర్ అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది. IIT ప్రొఫెసర్ & కోర్సు డైరెక్టర్ అనిల్ కుమార్ మంచికట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

*కార్యక్రమ విశేషాలు*:✅ ఈ సెమినార్‌లో 400 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొని సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, అత్యాధునిక కోర్సులు గురించి అవగాహన పొందారు.✅ Artificial Intelligence (AI), Data Science, Machine Learning, Python లాంటి టెక్నాలజీలపై ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు.*CTE కోర్సు డైరెక్టర్ అనిల్ కుమార్ మంచికట్ల సందేశం:*”సాఫ్ట్‌వేర్ రంగంలో టెక్నాలజీ పరిజ్ఞానం కలిగినవారికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. AI, Data Science, Full-Stack Development లాంటి కోర్సులు నేర్చుకుంటే, ₹50,000+ ప్రారంభ జీతంతో అత్యుత్తమ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి” అని విద్యార్థులకు వివరించారు.

*ఫలితం:*ఈ కార్యక్రమం ద్వారా 400 మంది విద్యార్థులు టెక్నాలజీ మార్గదర్శనం పొందారు. చాలా మంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (CTE) ద్వారా అందించబడే అత్యాధునిక కోర్సుల గురించి మరింత సమాచారం కోరారు. సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ అకాడమీ ఊరు రా ఊరు రా సాఫ్ట్వేర్ అని ఒక మోటివ్ తో ముందుకు వెళుతున్న ఈరోజు మన ఆసిఫాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (CTE), జిల్లా అధికారులు, మరియు విద్యార్థులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. “టెక్నాలజీ నేర్చుకుని, యువత భవిష్యత్తును నిర్మించుకోవడమే మా ప్రధాన లక్ష్యం!” ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో CTE మరియు CCR NGO సభ్యుల ముఖ్య భూమిక:🔖 భుక్యా చరణ్ కాంత్ – బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, CTE CCR సెంట్రల్ కమిటీ🔖 ఎన్. రత్నాకర్ – CTE లెర్నింగ్ మేనేజర్, రాష్ట్ర ఇన్‌చార్జ్, తెలంగాణ🔖 రవికుమార్ – ఐడి కార్డ్ ఇన్‌చార్జ్🔖 అబ్దుల్ వసీం – CCR జిల్లా ఇన్‌చార్జ్ & CTE లెర్నింగ్ మేనేజర్🔖 మోయిజుద్దిన్ – CCR సభ్యుడు🔖 జాడి శంరావు – CTE🔖 రాజా నర్సయ్య – CCR