జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు విద్యానగర్లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటా చలపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎం. నందిని విచ్చేసి జిల్లాలో స్థానిక సంస్థల పోటీపై కార్యకర్తలతో జరిగిన సుదీర్ఘ చర్చలో సమీపంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని తీర్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గల కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలలో పార్టీ శ్రేణులు పోటీకి సన్నిద్ధమవుతున్నారని తెలియజేశారు. సుదీర్ఘకాలంగా జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసి ప్రజాధరణ పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ తరుణంలో పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదర్శ నాయకుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు, జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై పాలక పార్టీలు నిరూపణలేని కేసుల్లో ఇరికించారని దేశంలో ప్రజలు ఇప్పటికే తెలుసుకొని ఇటీవల జరిగిన బై ఎలక్షన్లలో, పంజాబ్, గుజరాత్లలో కొన్ని స్థానాల్లో అఖండ విజయం పార్టీ సాధించిందని గుర్తు చేశారు. 2029లో భారతదేశంలో అనివార్యంగా ప్రధాని మార్పు ఉంటుందని క్రియాశీలక పాత్ర ఆమ్ ఆద్మీ పార్టీ పోషించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొప్పన శ్రీనివాస్, తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి బొంతల రాజేష్ రాయల్, విద్యార్థి నాయకులు చాంద్ షాహి, భరత్ నాయక్, యువజన నాయకులు యుగంధర్, వివిధ నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


