జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.నందలూరు, ఫిబ్రవరి23 :
రాష్ట్రస్థాయిలో ఆర్కే ఒలింపియాడ్ నిర్వహించిన అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారని పాఠశాల కరస్పాండెంట్ సమ్మెటశివప్రసాద్ తెలిపారు.కడప లోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ఆది వారం నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొ న్నారు. ఇందులో అన్నమాచార్య విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించడం విశేషమనిపేర్కొన్నారు.అబాకస్ విభాగంలో సి. తేజశ్రీ ప్రథమ స్థానం, పి. ధావన్ ద్వితీయ స్థానం సాధించగా, వేదిక్ మ్యాథ్స్ వివిధ మాడ్యూల్స్‌లో జోయా మెహక్, యస్వంత్, హరి లోహిత్ తృతీయ స్థానాల్లో నిలిచారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయు లు ఏనుగుల బాలాంజనేయులు, డైరెక్టర్లు మాడపూరి హేమలత, సమ్మెట ఉమా మహేష్, ఉపాధ్యాయులు షఫీ ఉల్లా, స్రవంతి, శివకుమారి, గోపిక, కృష్ణవేణి, భాగ్యలక్ష్మి తదితరులు అభినందనలు తెలిపారు.


