జనం న్యూస్-ఫిబ్రవరి 23- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ, నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ గా మానస సుమన్, వైస్ చైర్మన్ గా గొడవర్తి రాజా ప్రసాద్ లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అభిమానులు వారిని ఘనంగా సన్మానించారు. నూతన మున్సిపల్ చైర్ పర్సన్ మానస వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


