జనం న్యూస్ ఫిబ్రవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:
మానాల మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్) సోమవారం ఏర్గట్ల మండలం కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా దొంచందా గ్రామంలో ఇటీవల సర్జరీ చేయించుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అశ్వక్ భాయ్ని నాగేంద్ర నగర్‌లో బహ్రెయిన్ దేశంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన అల్లెపు రాజాం ను పరామర్శించారు. అలాగే ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు రొక్కెడ లింబారాజు తల్లి రొక్కెడ లింబవ్వ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమదేవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, వివిధ గ్రామాలసర్పంచులు,ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




