జనం న్యూస్ ఫిబ్రవరి 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు వరంగల్ ఇంచార్జ్ పల్లెబోయిన అశోక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన, ఖండనీయమైన ఘటన. ఈ దారుణంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ హనుమకొండ జిల్లా యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా యువజన అధ్యక్షుడు తీన్మార్ జయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? రెండు నెలల పసికందు ప్రాణం తీసిన నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుంటే చట్ట వ్యవస్థ ఏమి చేస్తోంది? బలహీన వర్గాల ప్రాణాలకు విలువ లేదా? కుల అహంకారంతో జరిగే హత్యలు ఆగకపోతే ప్రభుత్వ బాధ్యత ఎక్కడుంది?ఇకపై ఎస్ టి ఎస్ సి మైనారిటీ బీసీలపై దాడులు, హత్యలు, అవమానాలు కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు కూడా ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, వెంటనే బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, ఇవ్వాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని ఆయన హెచ్చరించారు.బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు చేపడతామని తీన్మార్ జయ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాజ్యాధికార పార్టీ హనుమకొండ జిల్లా యువజన అధ్యక్షుడు తీన్మార్ జయ్ మారేపల్లి క్రాంతి కుమార్బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మోగ్గం సుమన్ బి ఎస్ ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారపల్లి విజయ్ బి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారపల్లి సుధాకర్ బి ఎస్ ఎస్ మండల అధ్యక్షులు అంకేశ్వరపు ఐలయ్య రాయరాకల మొగిలి రాయరాకుల సుమన్ యాకయ్య,
రాయరాకుల సుమన్ యిరాకుల సుమన్ నడి గొట్టు అరవింద్ అశ్విత్ సాయి చరణ్ చంద్రమౌళి అశోక్ నరహరి పరమేష్ సత్యం శివ సాయికుమార్ యాకయ్య కుమారస్వామి బిక్షపతి మాచర్ల రవి
పాల్గొన్నారు…..


