Listen to this article

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల సమస్యల దిశగా, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువాయే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., తెలిపారు.ఈ రోజు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి 10 ఫిర్యాదులు స్వీకరించడo జరిగింది. అనంతరం పిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు.గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.ఈరోజు వచ్చిన ఫిర్యాదులలో భూవివాదాలకు సంబంధించి – 03, గొడవలకు సంబంధించి -03, డబ్బులు తీసుకుని మోసం చేయడంకు సంబంధించి -01, ఇతర అంశాలకు సంబంధించి -03 ఫిర్యాదులు రావడం జరిగింది. ….పి ఆర్ ఓ జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగులాంబ గద్వాల జిల్లా.