జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..గద్వాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నడుస్తున్న ‘రాజకీయ వ్యభిచారాన్ని’ గద్వాల గడ్డపై యువ నేత నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ గద్వాలలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో ఆయన బట్టబయలు చేశారు. రైతు సంఘర్షణ సభలో ఆయన ప్రసంగిస్తూ, అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు పతనమవుతున్న బీఆర్ఎస్‌ను తనదైన శైలిలో చీల్చి చెండాడారు.సిగ్గులేని ఫిరాయింపులు: “బహిరంగ సభల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేయమని అడుగుతారు.. కట్ చేస్తే, స్పీకర్‌కు మాత్రం మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని లేఖలు ఇస్తారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకేదైనా ఉంటుందా?” అని గొంగళ్ళ రంజిత్ కుమార్ మండిపడ్డారు.ఆ ‘టెక్నికల్’ దొంగతనం ఏంది?:పార్టీలు మారి భజన చేస్తున్న ఎమ్మెల్యేలు, టెక్నికల్‌గా తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని, తమ జీతం నుంచి పార్టీ ఫండ్ వెళ్తోందని చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. “తీసుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లకు సిగ్గుండాలి.. ఇయ్యడానికి మీకు సిగ్గుండాలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.చేతగాని కేసీఆర్, కేటీఆర్: పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడితే, కనీసం వారిని సస్పెండ్ చేసే దమ్ము కూడా కేసీఆర్, కేటీఆర్‌లకు లేదని విమర్శించారు. గద్వాల జిల్లాకు వచ్చి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ధైర్యం వారికి లేదని, కేవలం డ్రామాలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.70 ఏళ్ల కుటుంబ పాలనకు చరమగీతం:
ఈ ప్రాంతంలో ఏడు దశాబ్దాలుగా అత్తా, మామ, అల్లుడు అంటూ ఒకే కుటుంబం పెత్తనం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణచివేసిందని.. ఈ దోపిడీకి అంతం పలికే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.గొంగళ్ల రంజిత్ కుమార్ పంచ్:”ఒకడు అంగట్లో ఎమ్మెల్యేలను పెడితే.. ఇంకొకడు వేలం పాట పాడి కొంటున్నాడు. మధ్యలో ప్రజలను వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు. మీ డ్రామాలన్నీ పక్కన పెట్టండి, గద్వాల ప్రజలు మీ కపట ప్రేమను కనిపెట్టేశారని తెలిపారు.


