Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తాజాగా కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో వసంత్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం కట్టిన ప్రహారీ, పిల్లర్లను జేసీబీలతో శుక్రవారం అర్ధరాత్రి కూల్చి వేయడం కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వందల సంఖ్యలో పక్కా భవనాలు, పేదల గుడిసెలు నిర్మాణమై ఉన్నాయి. అధికారులు రెండు నెల కింద నోటీసు ఇవ్వడంతో ఇంటి నిర్మాణం పనులు ఆపేశామని అయినా అర్ధరాత్రి వచ్చి పడగొట్టడంపై బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. ”అవును రాత్రే కూల్చినం ఎవరూ అడ్డం రావొద్దు” కదా అంటున్నారు. ఇంతేగాక ఆ భూమి మొత్తం ఫారెస్ట్ దేనని మిగిలిన ఇండ్లకు సైతం నోటీసులు ఇచ్చి తీసేస్తామని చెప్తుతుండడం గమనార్హం. ఇలా అన్ని శాఖలు వేరు మేం వేరనే రీతిలో ఫారెస్ట్ ఆఫీసర్ల తీరు మారడం ఇబ్బందిగా మారుతోంది.గతంలో రిజర్వ్ ఫారెస్ట్ లో్ ఇండ్లు చుట్టూ పక్కలున్నాయి అనగా అప్పటి అటవి అధికారులు పట్టించుకోక పోవడం తో నిర్మించారని వాళ్లకు ఒక రూల్, వసంత్ కూ ఒక రూలా అటే మీరు ఏమైనా చేసుకోండి అని అన్నారు. కోర్టులో తేల్చుకుందామని అన్నారు. బీట్ ఆఫీసర్ ని చరవాణి ద్వారా వివరణ కోరగా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న పాత ఇండ్ల వారికి ఉన్నత అధికారుల ఆదేశాలమేరకు త్వరలో అందరికి నోటీసులు జారీ చేస్తామని, వసంత్ కు మూడు నెలలముందే నోటీసు జారీ జేశామని తెలిపారు.వసంత కుటుంబికులు నాకు నష్టం చేసిన బీట్ ఆఫీసర్ శ్రీదేవి, సెక్షన్ ఆఫీసర్ తులసిదాస్ నాయక్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోని నష్ట పరిహారం ఇప్పిస్తూ నాకు న్యాయం చేయాలనీ మీడియా తో వాపోయారు