జనం న్యూస్ ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండల పరిధిలో 23/ ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం మండల టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ క్విజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం ప్రారంభంలో స్వాగత ప్రసంగం నిర్వహించబడింది. దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ దేశ ప్రజలకు ప్రేరణ నిచ్చే కార్యక్రమమని, దేశ విద్యార్థులు అభివృద్ధి, భారతీయ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాఫ్ట్వేర్, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి, మహిళ సాధికారత, గతంలో జరిగిన మహా కుంభ మేళా, పర్యావరణ పరిరక్షణ, “వోకల్ ఫర్ లోకల్” వంటి అంశాలను ప్రజలకు పరిచయం చేస్తుందని వివరించారు.ఈ క్విజ్ పోటీలో విద్యార్థులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్నవారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల ,కళాశాల సిబ్బంది కూడా ఆసక్తిగా పాల్గొన్నారు.క్విజ్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేయబడినవి :
మొదటి బహుమతి,రెండవ బహుమతి,మూడవ బహుమతి మరియు పోటీలో పాల్గొన్న వారికి కూడా బహుమతులు అందజేశారు.ముఖ్య అతిధి ఇంచార్జ్ ఇళ్ళ సత్య నారాయణ, విశిష్ట అతిథి జిల్లా ట్రెజరెర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త(నానాజీ) మాట్లాడుతూ యువత ప్రతీ నెల మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినాలని, దేశాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తటవర్తి నాగారాజా రావు, ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ మట్టా సూరిబాబు,నిట్టల వెంకట లక్ష్మి,పెనుమల శాంతి శ్రీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ జిఎంసి బాలయోగి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చొప్పల పరిమళను దుస్సాలువతో సత్కరించినారు, అదేవిధంగా స్థానిక బాలురోన్నత పాఠశాల ఇంచార్జ్ దొమ్మేటి నాగలింగేశ్వర రావు ను దుస్సాలువతో సత్కరించారు.చివరగా కృతజ్ఞతలు తెలియజేసి జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.



