

పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల
జనం న్యూస్10 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )తెలంగాణా రాష్ట్రంలోనే పేరొందిన పాల్వంచ మండలం పరిధిలోని కేశవాపురం – జగన్నాధపురం గ్రామంలోని *శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి)* ప్రాంగణంలో *నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ట* తోపాటు *మహాకుంబాభిషేఖం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం ప్రారంభోత్సవ* కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారంతో ముగిశాయి. *సోమవారం మాఘశుద్ధ త్రయోదశి సందర్భంగా స్థిర మంత్రం, విగ్రహ శిఖర ప్రతిష్ట, కుంభాభిషేఖం, ధ్వజస్తంభ ప్రతిష్ట, మహాన్నదాన కార్యక్రమం* తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు* పాల్గొని, పూజలు చేశారు. *శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆశీర్వాదం పొందిన కొత్వాల*పెద్దమ్మతల్లి గుడిలో శివలింగ ప్రతిష్టకు వచ్చిన *తుని తపోవనం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారిని కొత్వాల కలిసి ఆశీర్వాదం పొందారు*.ఈ కార్యక్రమాల్లో *పెద్దమ్మతల్లి గుడి మాజీ చైర్మన్ మహీపతి రామలింగం, మాజీ డైరెక్టర్లు SVRK ఆచార్యులు, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, నాయకులు సందు ప్రభాకర్, బాదార్ల జోషి, శ్రీకాంత్, బానోత్ బాలాజీ, గంధం నర్సింహారావు, కాపర్తి వెంకటాచారి, తిరుమల రమేష్, SK బాషా*, తదితరులు పాల్గొన్నారు.