Listen to this article

జనం న్యూస్ 25 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

‘అరైవ్ అలైవ్’తో రోడ్డు ప్రమాదాలపై యుద్ధం రోడ్డు మీద ఒక చిన్న నిర్లక్ష్యం… క్షణం అలసత్వం… ఒక కుటుంబానికి జీవితాంతం మానని గాయంగా మారుతోంది. ఈ వాస్తవాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకoగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రెండవ దశ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది.‘అరైవ్ అలైవ్’ రెండవ దశ లో భాగంగా మూడవ రోజు లో భాగంగా *జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,* ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ప్రజలకు రోడ్డు భద్రతపై స్పష్టమైన మార్గనిర్దేశం అందిస్తున్నారు.ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం లోపించడం వంటి కారణాల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు జమ్మిచేడు జమ్ములమ్మ జాతరను పురష్కరించుకొని జాతరకు వచ్చే తెలుగు రాష్ట్రాల వారి తో పాటు కర్ణాటక భక్తులకు ట్రాఫిక్ ఎస్సై బాల చందర్ రోడ్డు ప్రమాదాల పై అవగాహనా కల్పించారు. సురక్షిత ప్రయాణం కుటుంబాలకు ఎంత అవసరమో తెలియజేస్తూ ప్రమాద బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను ఉదాహరణలతో వివరించి, చిన్న జాగ్రత్తలు ఎంతటి ప్రాణనష్టాన్ని నివారించగలవో తెలియజేస్తున్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాల్సిందిగా, మద్యం సేవించి వాహనం నడపరాదని, పరిమిత వేగాన్ని పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని అధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాల అమలు కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా అరికట్టాలని కూడా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, ఆటో మరియు కార్ డ్రైవర్లు, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.— పి.ఆర్.ఓజిల్లా పోలీస్ కార్యాలయంజోగుళాంబ గద్వాల్ జిల్లా