Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలోని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానీయా కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది… ఈ సందర్బంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర నాయకులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ మెనూ చార్జీలు 74 పైసలు డిసెంబరు నెల నుండీ చెల్లించాల్సిందిపోయి ఇంతవరకు చెల్లించకపోవడం కేవలం ప్రభుత్వ అధికారులు నిర్లక్షమేనని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు రెగ్యులర్ విద్యాధికారి లేకపోవడం మూలాన కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులు వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల క్షేమం కోరడం ఉత్తమాటేనని ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం ఖాయమని ఎద్దేవచేశారు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించినSSC పరీక్షలు జరుగుతున్న సందర్భంలో. ప్రభుత్వ, జడ్పీ మరియు మోడల్ స్కూల్స్లో సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను ఒక్కో విద్యార్థికి యూనిట్ ఖర్చు రోజుకు @రూ.15 /- గా నిర్ణయించడం వలన నిర్వహణలో భాగంగా కార్మికులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు కాబట్టి కనీసం ఒక్కో విద్యార్ధికి 20 రూపాయల యూనిట్ బడ్జెట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న కోడి గ్రుడ్ల బిల్లులు బకాయి వేతనాలు వెంటనే చెల్లింపులు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ లింగాపుర్ మండల అధ్యక్షురాలు కోడ్పే భీంబాయి ఇతరులు పాల్గొన్నారు.