Listen to this article

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).

త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పీఎంవో కాంప్లెక్స్‌ సేవాతీర్థ్ధ్‌లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతమున్న కేరళ రాష్ట్రం పేరు మలయాళంలో ‘కేరళం’ కాబట్టి దానిని కేరళంగా మార్చాలంటూ కేరళ శాసనసభ గతంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.