జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ కుడుపూడి నాగేశ్వరరావు కుమారి మామిడిశెట్టి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులచే కొత్తలంక వాస్తవ్యులు బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకరరావు, కాళ్లకూరి కామేశ్వర శర్మ ల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో యాగశాల ప్రదక్షణం భూతబలి యాగశాల ప్రవేశం గోపూజప్రతిష్ఠా సంకల్పం గణపతి పూజ పుణ్యాహ వాచనం దీక్షాదారణ అగ్ని ప్రతిష్టాపన హోమములు సర్వదేవతా ఆవాహనం యాగశాల బలిహరణం నీరాజనం మంత్రపుష్పం చతుర్వేద స్వస్తి కార్యక్రమాలతో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించి వచ్చిన భక్తులకు భారీ అన్న ప్రసాదం వితరణ చేయడం అలాగే ఈ ఆలయ నిర్మాణమునకు చొల్లంగి రమేష్ కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు కుడిపూడి శ్రీనివాసరావు దొమ్మేటి బ్రదర్స్ మామిడిశెట్టి సత్యనారాయణ చప్పిడి రమణ కట్టా రమణ రెడ్డి మోహన్ వాసంశెట్టి శ్రీనివాసరావు దొంగ సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాసరావు కొప్పిశెట్టి సత్యనారాయణ శీలం లావణ్య కుడిపూడి సింహాద్రిమ్మ చిట్టూరి బాలకృష్ణ చిలకలపూడి రామచంద్రరావు గుబ్బల ఈశ్వరరావులు మరియు గ్రామస్తులు ఆలయ కమిటీ వారు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొని గుడి ఆధారంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు అలాగే ప్రతి పౌర్ణమి రోజున సాయంకాలం సామూహిక హారతి ఇవ్వడం వలన మూలవిరాట్లో శక్తి పెరిగి ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహంతో నరగోష నరదృష్టి తొలగి సుఖశాంతులు కలుగుతాయని అన్నారు.



