Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 11 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ సూచనలతో జనవరి 30వ తారీఖున నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమం కోదాడ పబ్లిక్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, పలువురు ప్రజా ప్రతినిధులు, మీడియా రంగానికి చెందిన జిల్లా నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. గ్రాంట్ లో ప్రతిభ ఘనపరిచిన ముగ్గురు విద్యార్థులతో పాటు మరో 12 మందికి కన్సోలేషన్ బహుమతులను సైతం అందజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ప్రముఖులు, ప్రజలు హాజరు కావాలని కోరారు.