చండూరులో రైతులకు యూరియా కష్టాలు .
రాష్ట్రంలో కొనసాగుతున్న యూరియా కొరత సమస్య .
సెకండ్లలోనే బ్లాక్ అవ్వుతున్న ఫర్టిలైజర్ యాప్ .
అంతా అగ్రికల్చర్ అధికారుల చేతి వాటం అంటున్న రైతులు .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 26.
చండూరు లో యూరియా కొరతకు డీలర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ ప్రధాన కారణాలని ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో యూరియాను దాచిపెట్టి, అధిక ధరలకు విక్రయించడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పంటల మార్పిడి సాకుతో అధికంగా విక్రయించడం వంటి మాయలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం కూడా కొరతకు దారితీస్తోంది. *డీలర్ల మాయాజాలం: అవసరమైన సమయంలో యూరియా నిల్వలను దాచిపెట్టి, కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు (బ్లాక్ మార్కెటింగ్) విక్రయిస్తున్నారు.ఎరువుల దుకాణం వద్ద బారులు తీరిన అన్నదాతలుచండూరు మండల అన్నదాతలు యూరియా (Urea) కోసం ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారు జాము నుండి గంటల తరబడి పడి గాపులు కాయాల్సిన దుస్థితి నెలపొంది. ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టి వేచి ఉండాల్సిన పరిస్థితులు చండూరు మండలంలో చోటుచేసుకున్నాయి.చండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Agricultural Co-operative Society) పరిధిలో ఉన్న గ్రామాలకు యూరియా లోడ్ వచ్చిందని సమాచారం రావడంతో తెల్లవారుజాము నుండి యూరియా (Urea) కోసం రైతులు వరుసలైనులో పెట్టి దాదాపు ఎనిమిది గంటల వేచి ఉన్నారు. 450 బస్తాల గాను వెయ్యి మందికి పైగా రైతులు వచ్చారు.



