జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న రైతు వేదికలో బుధవారం రోజునా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రైనర్ ప్రేమలత మాట్లాడుతూ, డీఎస్ఆర్ (డైరెక్ట్ సీడెడ్ రైస్) విధానం ద్వారా వరి విత్తనాలు నేరుగా విత్తడం వల్ల రైతులకు ఎకరాకు రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు.అలాగే ఎరువుల సమర్థవంతమైన వినియోగం, దుక్కి మందుల వాడకం, కాంప్లెక్స్ ఎరువుల్లో నత్రజని, భాస్వరం శాతం, అధిక పెట్టుబడి భారం తగ్గించే విధానాలపై రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ట్రైనర్ కావేరి, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వంశీ కృష్ణ, జేసీఫ్ రవి పాల్గొనగా, అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు.


