

జనం న్యూస్ 10 కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )సుజాతనగర్ మండలంలో మద్యం వైన్ షాపు నిర్వాహకులు బరితెగించారు. రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైన్ షాపు నిర్వహణలో నిబంధనలకు పాతరేసి దర్జాగా తమ దందా సాగిస్తున్నారు. అరికట్టాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పోలీసు అధికారులు వారి గుప్పిట్లో పావులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. మండల పరిధిలో మొత్తం 2 మద్యం దుకాణాలు ఉండగా ఒక దుకాణాన్ని సిండికేట్ గా మార్చి అక్కడి నుండి మండల వ్యాప్తంగా ఉన్న బెల్ట్ దుకాణాలకు మధ్యం రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉండటం వల్ల పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. “రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యం” ఇక్కడ వైన్ షాప్ దక్కించుకున్న వాళ్లు తమకున్న రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తమను అడిగేదెవరు అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా సుమారు 200లకు పైగా బెల్ట్ షాపులకు అనధికారంగా అనుమతులు ఇచ్చి ప్రీమియం బ్రాండ్ మధ్యం తరలించి అమ్మకాలు జరుపుతున్నారన్నది బహిరంగ రహస్యం… “ఎనీ టైమ్ మధ్యం” నిర్దిష్టమైన సమయవేళలు పాటించకుండా బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల గ్రామాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం ఎక్సైజ్, పోలీస్ అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.