జనం న్యూస్ 26 ఫిబ్రవరి
సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం అన్నారు. మీ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, మౌలిక వసతులను మెరుగుపర్చుతూ, ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. విజయవంతంగా , పారదర్శకతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము.మీ భవిష్యత్తు కార్యాచరణను మరింత నిబద్దతో ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో బేసి జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ.గౌరవ అధ్యక్షుడు కొండపురం నర్సిములు,ఉపాధ్యక్షులు శంకర్ సాగర్ ,,, బిసి మైనారిటీ యూత్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్,,, భుడగజంగం యువ నాయకులు మాదినం శివ ప్రసాద్, వడ్డెర సంఘం యువ నాయకులు శేఖర్, జయ విజ్ఞాన భారతి సొసైటీ డైరెక్టర్లు బాలక్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.


