Listen to this article

(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 26) ఫరూక్నగర్, ఫిబ్రవరి 26:

షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్నగర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంచార పశు వైద్యశాల వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా కోఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పశు వైద్య వాహనంలో పనిచేస్తున్న సిబ్బంది పశువులకు అందిస్తున్న వైద్య సేవల విధానాన్ని అధికారులు పరిశీలించారు. వాహనంలో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స రికార్డులు, సేవల నమోదు వివరాలను తనిఖీ చేసి, పశువులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.అలాగే మండలంలోని పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న 1962 సంచార పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి సంచార పశు వైద్యశాలలు కీలకంగా పనిచేస్తున్నాయని వారు తెలిపారు.