Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి: అఖిల భారతీయ మాలి మహా సంఘం జాతీయ, రాష్ట్ర, అదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలు హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే నేతృత్వంలోని 21 మంది నేతల బృందం కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే తలపాగ, కండువా, జ్యోతిరావు పూలే సమగ్ర వాంగ్మయ గ్రంథాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎం కి సమర్పించి వాటిని పరిష్కరించాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం మాలీల ఎస్టి హోదా అంశం తో పాటు మిగతా అంశాలను పరిష్కరించేలా కృషి చేస్తా నని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ని రాష్ట్ర ప్రభుత్వం “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” గా ప్రకటించి ఘనంగా జరుపుకున్న అందులకు గాను, ప్రగతి భవన్ ను మహాత్మ “జ్యోతిరావు పూలే ప్రజాభవనం” గా నామకరణం చేసినందుకుగాను ఫూలే వారసులైన నాయగం సతార మహారాష్ట్ర కు చెందిన దిలీప్ గణపతి నేవసే జాతీయ అధ్యక్షులు విలాసరావు పాటిల్, గుజరాత్ సంఘ అధ్యక్షులు డాక్టర్ శ్యామరావు ఫూలే, మధ్యప్రదేశ్ అధ్యక్షులు అడ్వకేట్ అఖిల వాగేలా మాలి మహా సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వినోద నాగోశే, రాష్ట్ర ఉప అధ్యక్షులు గుర్నులే నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న సెండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, కుమ్రం భీం జిల్లా అధ్యక్షులు గుర్నులే మేంగజి, కొట్రాంగె సాగర్, బెండరే కృష్ణా, సెండే తిరుపతి, సెండే చంద్రశేఖర్, వినోద్ గురునులే తో కలిసి సుకుమార్ పెట్టుకులే మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో మాట్లాడుతూ తెలంగాణ మాలిలకు ఎస్టీల హోదా కల్పించాలని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపడం జరిగింది. ఆ బిల్లును కేంద్రంపై ఒత్తిడి పెంచి ఆమోదింప చేసుకుని మాలీలకు న్యాయబద్ధంగా రావలసిన ఎస్టి హోదాను కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు. అలాగే మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు జీవిత చరిత్రలు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని, ట్యాంకు బండ్ పులే దంపతుల విగ్రహాలను నెలకోల్పాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకొని రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో మాలి కమ్యూనిటీ భవనాలకు స్థలాలను కేటాయించి రెండు కోట్ల చొప్పున నిధులను కేటాయించాలని కోరడం జరిగింది. ఇలా 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ సీఎం కి సంఘం తరఫున సమర్పించడం జరిగింది.