Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మైలారం గ్రామంలో ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ జక్కుల శ్రీనివాస్ తెలుగు దిన పత్రిక మూడవ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మైలారం గ్రామంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాస్ట్ న్యూస్ పత్రికను ఆదరిస్తున్న మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు పాస్ట్ న్యూస్ ముందంజలో ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నూనె దివ్య- తిరుపతి, గ్రామ కార్యదర్శి రాజేందర్, ఉప సర్పంచ్ మస్కే కుమారస్వామి, వార్డ్ మెంబర్ పల్లె బోయిన రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు……