జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి
భక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు అమ్మవారి అలంకరణ, పులిహార ప్రసాద వితరణ చేయడం జరుగును.సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలతో నిర్వహించడం జరుగును.
యావన్మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం, కాట్రేనికోన


