Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.26/02/2026

నందలూరుమండలం నాగిరెడ్డిపల్లి హై స్కూల్ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు జీవన మిత్ర ఫౌండేషన్ ఒక అభినంద నీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజు నాగిరెడ్డి పల్లి హై స్కూల్ లో జరిగిన కార్య క్రమంలో విద్యార్థులకు అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్‌లు, పెన్నులు, పెన్సిళ్లు మరియు లాంగ్ స్కేళ్లతో కూడిన కిట్‌లను ఫౌండేషన్ ప్రతినిధులుపంపిణీచేశారు.తల్లి దండ్రుల కష్టాన్ని స్మరిస్తూ.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల ఎదుగు దల వెనుక వారి తల్లిదండ్రుల నిరంతర శ్రమ దాగిఉందని గుర్తుచేశారు.తల్లిదండ్రులత్యాగం:తల్లిదండ్రులు తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని, తమ అవస రాలను సైతం పక్కన పెట్టి పిల్లల చదువు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. విద్యార్థులు ఈ విషయాన్ని ఎప్పటికీ మరువకూడదు.”బాధ్యత: ఈ పరీక్షా సామాగ్రి కేవలం వస్తు వులు మాత్రమే కావని, మీ తల్లిదండ్రుల కలలను నిజం చేసే ఆయు ధాలని విద్యార్థులకు సూచిం చారు. కష్టపడి చదివి మంచి ఫలి తాలు సాధించ డమే మీరు మీ తల్లిదండ్రు లకు ఇచ్చే అసలైన గౌరవం అనిపేర్కొన్నారు.అధ్యక్షులు వీరబల్లి జయకుమార్ రెడ్డి ఉపా ధ్యక్షుడు గురివిగారి వాసు కోశాధి కారి గుండాల జానకి రవితేజ కార్యదర్శి అశోక్ రెడ్డి, ముఖ్య సలాహదార్లు చలపాటి కృష్ణ (నగేష్) , ఆండ్ర శివారెడ్డి కమిటీ సబ్యులు సయ్యద్ జుల్ఫీకర్, వరప్రసాద్, దేవిసెట్టి తులసి రామ్, దేవరపల్లి సాయి కుమార్,కొండేటి సుదర్శన్,బూపాలం సునీల్ , సునీల్ రెడ్డి(రైల్వే)చింత నవీన్ రెడ్డి, చోటు సింగ్,సాగర్,నామల సోలమన్ (నిర్మల్).