Listen to this article

జనం న్యూస్ 27 ఫిబ్రవరి

సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ చీఫ్ బ్యూరో షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో కంది పంచాయతీ సెక్రెటరీ కవిత మరియు కంది గ్రామ ఉపసర్పంచ్ అసద్ ఖాన్ చేతుల మీదగా చార్మినార్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ మరియు ఈ వి 9 న్యూస్ డైరీ ఆవిష్కరించడం జరిగింది..ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చార్మినార్ ఎక్స్ ప్రెస్ పేపర్ నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తుందని వారికి ధన్యవాదాలు తెలియజేసారు..అలాగే కంది గ్రామ ఉప సర్పంచ్ అసద్ మాట్లాడుతూ ప్రజలందరూ సోదర భావంతో కలిసి మెలసి ఉండాలని,కంది గ్రామ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఈ వి 9 రిపోర్టర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..