జనంన్యూస్. 27.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ పట్టణం లోని రాధ కృష్ణ పాఠశాల. ఆర్య సమాజ్ లో సుమారు 300 మంది విద్యార్థిని ,విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధములు పంపిణీ చేసి ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాల, యోగ, దినచర్య, రుతుచర్య ల గురించి వివరించినట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇంచార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు.ఈ వైద్య శిబిరం లో పాఠశాల ప్రిన్సిపల్స్ అనిత, సునీత,, ఆయుష్ విభాగం ఫార్మా సిస్ట లు న్యవానంది పురు షో తం, ఉమాప్రసాద్, ఆయుష్ సిబ్బంది రమేష్, భిక్షపతి,మహేష్,ఉపాధ్యాయులు నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించినందుకు పాఠశాల తరపున అభినందించారు. ఆయుష్ కరదీపికలను పంపిని చేశారు.



