సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఫిబ్రవరి 26:
నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాఠశాల కొనసాగుతుందని స్థానిక శ్రీ మాణిక్ ప్రభు ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ మరెల్లి వెంకటయ్య వ్యాఖ్యనించారు. పాఠశాలలో గురువారం నాడు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈరోటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత మైన లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ క్రమంలోనే విద్యార్థులు ముందడుగు వేయాలని సూచించారు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తే సంస్కారం ఆదర్శమైన జీవితానికి నడక నేర్పిస్తుందని ఉద్బోధించారు. ఈ స్వయంపాలన దినోత్సవంలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఎం. వైష్ణవి, మండల విద్యాధికారిగా డి. పూజ, ప్రిన్సిపాల్ గా ఎస్.తుల్జారాం, మరికొంత మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులను నిర్వర్తించారు. అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మాణిక్యమ్మ,నాగలక్ష్మి, శివశంకర్, నర్సింలు, అరుణ, స్వరూప, మందాకిని, అనిత, సువర్ణ, సోని, లక్ష్మి, రాజేశ్వరి లు పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగిన ఈ స్వయం పాలన దినోత్సవంలో పోషకులు సైతం తమ చిన్నారులను హోదాకు తగ్గట్టుగా వేషధారణ చేసి పంపడం ఆహుతులను ఆకట్టుకొంది.


