Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సర్వేయర్ ఎర్ర ప్రగడ ను తాహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కార్యాలయ సిబ్బంది ఆయన కు శాలువ తో సన్మానించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సర్వేయర్ ఎర్ర ప్రగడ మండలంలోని గట్లకానిపర్తి గ్రామ శివారు నుండి వెళుతున్న ఎన్ఎచ్ రోడ్డు నిర్మాణం కొరకు త్వరగా తన సిబ్బందితో కలసి సర్వే చేసి మ్యాపింగ్ రిపోర్ట్ ఇచ్చారు . అలాగే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించడంలో సర్వేర్ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా రైతులు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు తక్షణమే సర్వే చేసి రిపోర్టు ఇచ్చేవారని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ ప్రభావతి, ఎమ్మారై రమేష్ బాబు, ఏఆర్ఐ రమేష్, జి పి ఓ లు వంగేటి సత్యం, దేవేందర్ ,నరేష్ ,తులసి రామకృష్ణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు……