Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ శారద స్కూల్ లో గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ డి ఓ నారాయణ హాజరై విద్యార్థులకు క్వషన్ పేపర్ విడుదల చేసి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థుల చేతుల్లో ఈ దేశ భవిష్యత్తు ఉందని అన్నారు పదో తరగతి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరూ ఇది మీకు మొదటి మెట్టు అన్నారు విద్యార్థుల వల్లే ఈ దేశం మంచి మార్గంలో నడుస్తుందని తెలిపారు మార్చిలో జరగబోయే టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను కనపరచలన్నారు ఈ కార్యక్రమంలో శారద స్కూల్ సంతోష్ ,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా కమిటీ సభ్యుడు సాల్మన్ రాజ్. జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్ ,విద్యార్థులు పాల్గొన్నారు….