జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి పట్టణం దేమునిగుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములో ఆలయంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ధ్వజారోహణం ఘనంగా జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి గరుడ ఆల్వార్లకు ఆగమ శాస్త్ర ప్రకారం గా పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి గోవింద నామస్మరణతో, ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా దేవాలయం ప్రధాన అర్చకులు పులకండం విజయబాబు, పులకండం గిరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు, కార్య నిర్వహణ అధికారి కె చంద్ర తేజ, అర్చకులు పులకండం ప్రసాద్ బాబు, పులకండం రాజేష్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గోళి మురళి, సిహెచ్ నూకరాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


