

జనం న్యూస్ //ఫిబ్రవరి //10//కుమార్ యాదవ్..పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మం కన్నాల గ్రామానికి చెందిన కావేటి లక్ష్మి అనే మహిళ కు ప్రమాదవశాత్తు తన ఎడమకాలు, కోల్పోయారు. ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను సంప్రదించగా, ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో,భగవాన్ మహవీర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తనకు జైపూర్ ఫుట్ ను అందించడం జరిగింది. వినవంక మండలం వాల్బాపూర్ గ్రామానికి చెందిన గాదె గుణ సాగర్, ఆలయ ఫౌండేషన్, కో ఆర్డినేటర్, ఎంతోమంది నిరుపేదలైనటువంటి, వారికి తన వంతు సహాయంగా, నిలబడుతున్నారు. కావేటి లక్ష్మి, తన ఆర్థిక పరిస్థితి బాగా లేనందున, గాదే గుణ సాగర్ ను సంప్రదించగా, జైపూర్ ఫుట్ ను అందజేశారు. ఈ సందర్భంగా, నరహరి ఐఏఎస్ అధికారికి, మరియు గాదె గుణసాగరికి కావేటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.