పదవి చిన్నదైన శభాష్ అనిపించుకుంటున్న బట్టాపూర్ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్
జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :
గుమ్మిర్యాల్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ వరకు బస్సు సౌకర్యం పునరుద్ధరణకు యువకులు, హైదరాబాద్‌లో చదువుకుంటున్న విద్యార్థులు, వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు తనను కలిసి సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో తాను ఫిబ్రవరి 7న ఆర్మూర్ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశానని భట్టాపూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ తెలిపారు.ఏర్గట్ల మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్తుండటంతో బస్సు సౌకర్యం ఎంతో అవసరమని డిపో మేనేజర్‌కు వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ 15 రోజులలోపు బస్సు సర్వీస్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.హామీ మేరకు ఈ నెల 25న ఆర్మూర్ బస్టాండ్‌లో ఏర్గట్ల ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్ యాదగిరి, ఆర్టీసీ సిబ్బందితో కలిసి కొబ్బరికాయ కొట్టి బస్సు సర్వీసును ప్రారంభించినట్లు దయానంద్ తెలిపారు.ఈ బస్సు నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామం నుంచి ఉదయం 4:30 గంటలకు బయలుదేరి గుమ్మిర్యాల్, దొంచంద, తాళ్లరాంపూర్, ఏర్గట్ల, తిమ్మాపూర్, పాలెం మీదుగా మోర్తాడ్, ఆర్మూర్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు ఉదయం 10 గంటలలోపు చేరుకుంటుందని తెలిపారు.అదేవిధంగా హైదరాబాద్ జేబీఎస్ నుంచి ఉదయం 11:15 గంటలకు ఆర్మూర్‌కు బయలుదేరి సాయంత్రం 4 గంటల లోపు ఆర్మూర్ చేరుకుంటుందని, అనంతరం రాత్రి 8:30 గంటలకు ఆర్మూర్ నుంచి బయలుదేరి నైట్ హాల్ట్ కోసం రాత్రి 10 గంటలకు పొనకల్ గ్రామానికి చేరుకుంటుందని వివరించారు.ఈ బస్సు సౌకర్యాన్ని ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో పాటు ప్రక్క మండలాలైన ముప్కాల్, సావెల్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భట్టాపూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ కోరారు.



