

గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి దేవాలయ ధర్మకర్త బిక్కా రామాంజనేయరెడ్డి .
జనంన్యూస్: ఏ.పీ స్టేట్ బ్యూరో చీఫ్, ఫిబ్రవరి 10, (): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం సలకలవీడు గ్రామములో త్రేతా యుగములో స్వయానా సీతాదేవి ప్రతిష్టించిన శ్రీ రామలింగేశ్వర స్వామి పునః ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. రామలింగేశ్వర స్వామి దేవస్థానము ఎంతో విశిష్టమైనదని మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో జ్యోతి వెలుగుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసము. దేవస్థానము నందు వెలిసిన రామలింగేశ్వర స్వామి దర్శించుకుని మనము మొక్కుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. సలకలవీడు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి విశిష్టమైనదని త్రేతా యుగములో వెలిసిన స్వయాన రామలింగేశ్వర స్వామి అద్భుతమైన మహిమలు కలిగి ఉన్నాయని గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉంటారని చరిత్ర తెలుపుతుంది.దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి దక్షిణాముక వీరాంజనేయ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. సలకలవీడు గ్రామంలో వెలిసిన దక్షిణ ముఖ ఆంజనేయస్వామి త్రేతా యుగం కాలంలో ఇక్కడ వెలిశారని చరిత్ర చెబుతుంది. ఎన్నో మహిమలు శక్తులు కలిగినటువంటి దక్షిణా ముఖ వీరాంజనేయ స్వామికి భక్తులు కోరికలు కోరిన ఆ కోరికలు తీరుతాయని ప్రజలు ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నారని చరిత్ర చెబుతోంది. అత్యద్భుతమైన ఎన్నో మహిమలు కలిగిన ఈ దేవస్థానములో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ శాసనాలలో లిక్కించబడినది అని చరిత్ర చెబుతుంది.రామలింగేశ్వర స్వామి దేవస్థానమును పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేవుని ఆశీస్సులతో ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తూ దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న బిక్కా రామాంజనేయరెడ్డి కుటుంబము, గ్రామస్తుల సహకారంతో, పూర్తిస్థాయిలో సకల సౌకర్యాలతో దేవస్థానం మనము అభివృద్ధి జరుగుతుంది. బిక్కా రామాంజనేయరెడ్డి కుటుంబాన్ని సలకలవీడు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.సోమవారం జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుల జంకె వెంకటరెడ్డి కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందినారు. అనంతరం కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. మహోత్సవ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులు బిక్కా కృష్ణారెడ్డి, పిడతల వెంకట రంగారెడ్డి, ఓరి మడుగు రమణారెడ్డి, ఓరి మడుగు వెంకటేశ్వర రెడ్డి, బిక్క అప్పిరెడ్డి కార్యక్రమంలో పాల్గొని అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది.