Listen to this article

జనం న్యూస్ మునగాల ఫిబ్రవరి 27 – కందిబండ హరీష్: అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునగాల పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు నాఖాబంది నిర్వహించి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..పోలీస్ శాఖ ప్రభుత్వము రోడ్డు భద్రత పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసుకున్నప్పటికీ అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని,ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం వాహనదారుల, ప్రజల అజాగ్రత్త, మానవ తప్పిదం అని అన్నారు. రోడ్డు నియమాలు ముందస్తు జాగ్రత్తల పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేపట్టామని అన్నారు.పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.పిల్లలకు వాహనాలు ఇస్తే సరదా కాస్తా విషాదమవుతుందని గుర్తు చేశారు.వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఇతరులను కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నారని తెలిపారు.