Listen to this article

..రైతు రక్షణ సమితి నేతకు శుభాకాంక్షల వెల్లువ.

.జనం న్యూస్ 10 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతురక్షణ సమితి (టీఆర్ఆర్ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రైతు సంఘం నేతగా, నాయకుడిగా హింగె భాస్కర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన శ్రేయోభిలాషులు అందరూ ఆకాంక్షించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఆరె సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న ..హింగె భాస్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు. హుజూరాబాద్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ జి .. భాస్కర్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీతో పాటు సంఘం నేతలు జెండా రాజేశ్ తదితరులు భాస్కర్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రావు వరికెలతో పాటు ఎల్కతుర్తి మండల సంఘం నాయకులు, మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు, రైతులు సైతం హింగె భాస్కర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలిపారు. రైతుల పక్షాన వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా పోరాటం చేస్తున్న భాస్కర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని దీవెనలు అందజేశారు.