Listen to this article

పెద్ద యాచవరంలో విద్యుత్ శాఖపై తీవ్ర ఆరోపణలు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో , ఫిబ్రవరి 28(జనం న్యూస్):

మార్కాపురం జిల్లా,మార్కాపురం రూరల్ పరిధిలోని పెద్ద యాచవరం గ్రామంలో విద్యుత్ శాఖ చుట్టూ అవినీతి రాజకీయాలు కోకొల్లలుగా మారినట్లు గ్రామస్థుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రూరల్ ఏఈ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఏఈ లైన్ మెన్ వీళ్ళిద్దరూ వ్యవహారశైలి పై గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, మీటర్లు అమర్చడంలో మీటర్ లేని వాళ్లకి కలెక్షన్ ఇవ్వడం అది ఏమిటంటే పట్టించుకోవడం లేదు , లైన్లు మరమ్మత్తు చేయడంలో డిమాండ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని చేయాలంటే ముట్టజెప్పాల్సిందే అన్న వాతావరణం నెలకొన్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి తక్షణ సేవలు అందుతుండగా, మరికొందరికి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.అవినీతి రాజకీయాలు చేస్తున్నారని గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఎవరు ఏ వర్గానికి చెందినవారో చూసి సేవలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పేర్లు చెప్పి బెదిరింపులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో కూడా నిర్లక్ష్యం జరుగుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. పంటకాలంలో విద్యుత్ అంతరాయాలు పెరిగినా, ఫిర్యాదులకు స్పందన లేదని రైతులు చెబుతున్నారు. సమస్యలు చెప్పేందుకు కార్యాలయం వెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.గ్రామంలో విద్యుత్ శాఖపై పెరుగుతున్న ఆగ్రహం పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తోంది. ప్రజా సేవ కోసం ఉన్న శాఖ రాజకీయ రంగంలోకి జారిపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినీతి రాజకీయాలు ఆగకపోతే పెద్ద స్థాయిలో ఆందోళనలు తప్పవని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణం విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సేవలో పారదర్శకత లేకపోతే ఇలాంటి ఆరోపణలు మరింత పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పెద్ద యాచవరం లో అవినీతి రాజకీయాలు చెలరేగిన ఈ పరిణామం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.