Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లోని సోమక్కపేట పాఠశాలలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రముఖ భారత శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను స్మరించుకుంటూ జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ విట్టల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. శాస్త్ర విజ్ఞానం మన దైనందిన జీవితంలో ఎంత అవసరమో వివరించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, మోడల్స్ ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించడం జరిగింది .ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు అజయ్ కుమార్ ,రమాదేవిలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవ్ గౌడ్ ,మోహన్ ,మహేష్ కుమార్ ,విష్ణువర్ధన్ ,విజయ విద్యార్థులు, పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.