Listen to this article

జనం న్యూస్: ఫిబ్రవరి 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్

నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలో స్త్రీ, శిశు సంక్షేమ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి హాజరైనారు ఊట్కూరు గ్రామంలో ఎం ర్ ఎన్ ఆర్ జి స్ నిధులతో 20 లక్షల రూపాయల వ్యయమంతో స్త్రీ,శిశు సంక్షేమ భవన నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ
నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీలలో గ్రామాల అభివృద్ధిలో తన వంతు కృషి ఉంటుందని,గ్రామాభివృద్ధిలో తోడ్పడుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుమెటి వసుమతి నర్సింహా, ఉప సర్పంచ్ బుచ్చాల నాగార్జున, మాజీ పాక్స్ డైరెక్టర్ కేశబోయిన జానయ్య గౌడ్,మాజీ ఎంపీటీసీ బత్తిని రాధా నరేందర్,రైతు బందు సమితి అధ్యక్షులు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి,వార్డ్ మెంబరు లు నర్సింగ్ కృష్ణయ్య, నర్సింగ్ మమత మహేష్, బాసిపాక రూపవిజయ్,గ్రామ సీనియర్ నాయకులు నర్సింగ్ నర్సింహా,నర్సింగ్ రవి,నర్సింగ్ నరేష్,పాములూరి నర్సింహాచారి, బోల్లేపల్లి రామయ్య,బత్తిని లింగయ్య,బత్తిని నర్సింహా,బొడ్డు కృష్ణయ్య,నర్సింగ్ నారాయణ, ఎలిజాల నాగయ్య,ఎలిజాల వెంకటయ్య,బసిపాక నవీన్, నర్సింగ్ బక్కయ్య,వివోలు ఉప్పరి మొగలయ్య ,పాతనబోయిన వెంకటేష్వార్లు నర్సింగ్ జానయ్య, తదితరులు పాల్గొన్నారు