తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 28 ఫిబ్రవరి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశానికి చెందిన రాజస్థాన్ గుజరాత్ అస్సాం బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నాణ్యతలేని వస్తువులు విక్రయిస్తూ ఒక గారడి లాంటి వ్యాపారం నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారులకు కార్మికులకు కృంగదీస్తున్న సందర్భంలో గౌరవనీయులు డాక్టర్ పిడమర్తి రవి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గానికి అధ్యక్షులుగా డాక్టర్ పిలమర్తి రవి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు ఈ యొక్క కార్యవర్గానికి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు పి రాములు నేత గారికి గో బ్యాక్ మార్వాడి రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగినది వారు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమ తరహాలో రాబోయే రోజులలో అన్ని జిల్లాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నాను ఈ పదవిని ఇచ్చినందుకు గో బ్యాక్ మార్వాడి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కార్యక్రమానికి మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ సుప్పాల పండరినాథ్ శ్రీనివాస్ రవి గార్లు పాల్గొన్నారు


