Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్

బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సు రాజుల గ్రామంలో న్యాయమూర్తి జే వినీల్ కుమార్ నిర్వహించారు ,
న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు చిన్నచిన్న తగాదాలతో కేసులు పెట్టడం కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి అమూల్యమైన సమయాన్ని వృధ చేసుకోవద్దని మరియు మైనర్ పిల్లలకు బాల్య వివాహాలు చేయవద్దని అన్నారు మైనర్ బాలురకు బైక్స్ నడపడానికి సహకరించవద్దని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ లైసెన్స్ మరియు బండి ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు, ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జై కుమార్ మరియు అడ్వకేట్ శిల్ప అడ్వకేట్ మహమ్మద్ అడ్వకేట్ మనోజ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు